గ్రామపంచాయతీ 2వ విడత ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ నర్సింగ రావు,ఎన్నికల సాధారణ పరిశీలకులు గంగాధర్ తో కలిసి రెండవ విడత పోలింగ్ సిబ్బందికి సంబంధించి మూడవ ర్యాండమైజేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశామని, ఈనెల 14వ తేదీన జిల్లాలోని ఐజ, మల్దకల్,వడ్డేపల్లి,రాజోలి (4)మండలాల్లో కలిపి మొత్తం 716 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఏకగ్రీవాల అనంతరం మిగిలిన 567 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని ర్యాండమైజేషన్‌ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. 2వ విడత ఎన్నికలలో 1,34,601 మంది ఓటర్ల తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారని, పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధుల నిర్వహణ విజయవంతంగా నిర్వహించేందుకు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది వివరాలను సంబంధిత మండలాల తహసీల్దార్ లకు వెంటనే అందజేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీకాంత్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం, ఈ.డి.యం. శివ,ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు