విదేశీ విశ్వ విద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గద్వాలలోని టి.జి.బి.సి స్టడీ సర్కిల్ నందు ఉచిత కోచింగ్ ప్రారంభిస్తున్నట్లు టి.జి.బి.సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యతో పాటు స్కాలర్ షిప్ పొందేందుకు IELTS శిక్షణ మరియు ఇంగ్లీష్ లో మంచి ప్రావీణ్యం పొందుటకు డిగ్రీ పూర్తి చేసిన వారు లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న B.C. నిరుద్యోగ యువతి,యువకులు అర్హులని తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్ నందు ఈ నెల 21 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరములకు ఫోన్ నెంబర్ 9985434941, 88546-293022 సంప్రదించాలని కోరారు.