నేడే ప్రమాణ స్వీకారం
- భం
- కొలువుదీరనున్న కొత్త సర్పంచులు, ఉపసర్పంచులు
- ముస్తాబైన గ్రామ పంచాయతీ భవనాలు
- ఆశల పల్లకిలో గ్రామాలు
- కొత్త పాలకుల ముందున్న గ్రామ సమస్యలు
- కొత్తపాలకుల ముందున్న గ్రామ సమస్యలు
ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు హార్థిక శుభాకాంక్షలు
గద్వాల::పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాను. గద్వాల జిల్లా వ్యాప్తంగా 255 గ్రామ పంచాయతీల్లో సోమవారం కొత్త సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే బాధ్యతల్లో చేరనున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం 13మండలాల్లో 255 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. సర్పంచ్ లు గా ఎన్నికైన వారు అధికారికంగా నేడు బాధ్యతల్లో చేరనున్నారు. ఈ క్రమంలో అన్ని పంచాయతీల్లో అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.
సవాళ్లే అధికం….
గ్రామ పంచాయతీలను రెండేళ్లుగా నిధుల కొరత వేధిస్తోంది. ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులకు గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. పంచాయతీ ఖాతాల్లో నిధులు అందుబాటులో లేవు. రెండుళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రాకపోవడంతో పల్లెల్లో పాలన పడకేసింది. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైనేకీ, వీధిదీపాలు, తాగు నీటి, తదితర సమస్యల పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో పాఠశాలలు శిథిలావస్థలో ఉండడం, టాయిలెట్స్ లేకపోవడం, సరైన బెంచీలు, కరెంట్ లేక చాలాచోట్ల ఇబ్బందులున్నాయి. గత ప్రభుత్వంలో మన ఊరు– మన బడి పథకం కింద మరమ్మతులు చేసినా ఆశించిన స్థాయిలో పూర్తి కాలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి మరమ్మతులు చేపట్టారు. కొత్త సర్పంచులు వాటిపై శ్రద్ధపెట్టి పనులు పూర్తి చేయాల్సిన అవసరముంది. అలాగే గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తదితర సమస్యలపై చర్యలు తీసుకోవాలి.

