25 ఏళ్లుగా నా కష్టకాలాల్లో తోడుగా నిలబడ్డాడు.
ప్రతాప్ గౌడ్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా.
దశ,దినకర్మ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల: గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం పరిధిలోని అనంతపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కీ.శే ప్రతాప్ గౌడ్ దశదినకర్మ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరైన ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ* ….
మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ నా ఆత్మీయ మిత్రుడు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు జీవితాంతం ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
నాకు అత్యంత ఆత్మీయ మిత్రులు ప్రతాప్ గౌడ్ ఒకడు నా సూచనలు సలహాలు చెపుతూ నాతో పాటు కష్ట సమయంలో నా వెంట నడిచిన ఈ విషయాన్ని పరిశీలించి ప్రజలకు మేలు చేసే విధంగా కృషిచేసి నాయకుడు అకస్మాత్తుగా మరణించిన బాధాకరమైన విషయం ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని అని పేర్కొన్నారు. గద్వాల నియోజకవర్గంలో నా రాజకీయ ప్రస్థానంలో గద్వాల మండలం నాయకులు నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. అన్న మీరు మిగతా మండలాలలో చూసుకోండి గద్వాల మండలాన్ని మేము చూసుకుంటామని ఎంతో భరోసానిచ్చేవారు.
ప్రతాప్ గౌడ్ లేకపోయినా ఆయన జ్ఞాపకాలు నాతోపాటు జీవితాంతం ఉంటాయని తెలిపారు.
అనంతపురం గ్రామ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
గద్వాల మండలంలోని కాకుండా గద్వాల నియోజకవర్గంలో ప్రతాప్ గౌడ్ పేరును చిరస్థాయిగా నిలిచిపోయే నా వంతు నేను కృషి చేస్తానని తెలిపారు.
శ్రీ కీ.శే ప్రతాప్ గౌడ్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను* .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.