*ఉద్యోగం చేస్తూ ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడిన కొందరు టీచర్లు **
బెట్టింగ్ యాప్ లలో నష్ట పోవడం తో ఉద్యోగం చేస్తున్న చోట అమాయకుల దగ్గర అప్పులు తీసుకొని తిరిగి అప్పు చెల్లించ కుండా చుక్కలు చూపిస్తున్నట్టు సమాచారం
*గద్వాల్ జిల్లాలో కొందరు ప్రభుత్వ టీచర్లు బిజినెస్ మెన్లుగా మారారు…సైడ్ ఇన్‌కమ్ కోసం అడ్డదారులు తొక్కుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు దందాలు చేస్తున్నారు. బిజినెస్ చేయడంలో ఎలాంటి తప్పులేదు.. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డదారిలో బిజినెస్ చేస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. నలుగురికి మంచి చెప్పాల్సిన టీచర్లే పర్మిషన్ లేకుండా ఫైనాన్స్, రిజిస్ట్రేషన్ లేకుండా చిట్టీలు, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు అడ్మిషన్లు చేస్తున్నారు.టీచర్లుగా సమాజంలో వారి పై ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో చాలా వరకు ప్రభుత్వ టీచర్లు ఆర్‌బీఐ గైడ్ లైన్స్‌ను తుంగలో తొక్కి ఫైనాన్స్ చిట్టీలు నిర్వహిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. అయినా వారిని కట్టడి చేయడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో చాలామంది ప్రభుత్వ టీచర్లు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తుంటే ఇలాంటి కొందరు టీచర్లు చేస్తున్న అక్రమ దందాలు విద్యాశాఖకు మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి.

