మహబూబ్ నగర్ పట్టణం లోని MBC చర్చ్ లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని,ప్రత్యేక ప్రార్థనలు చేసారు.అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి,క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు,మాజీ మంత్రివర్యులు వి.శ్రీనివాస్ గౌడ్ గారు,మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్ గారు,డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి గారు,సీనియర్ నాయకులు వినోద్ కుమార్ గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి గారు,మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షబ్బీర్ అలీ గారు మరియు స్థానిక క్రైస్తవ మత పెద్దలు,సంఘ ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.