తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో, కేజీబీవీ లలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి గణిత టాలెంట్ టెస్ట్ ను ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల గద్వాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు అతిథిగా రావడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ సమక్షంలోనే జిల్లాస్థాయి మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్ ప్రశ్నాపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ జిల్లా స్థాయి గణిత టాలెంట్ టెస్ట్ లో తెలుగు మీడియం విభాగంలో బి సురేంద్ర జడ్పీహెచ్ఎస్ భూoపురము, విజయలక్ష్మి జెడ్పిహెచ్ఎస్ తనగల మొదటి స్థానం పొందారు. రెండవ స్థానము నిక్షిత ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, గద్వాల్ పొందినది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం విభాగంలో జిల్లా మొదటి స్థానంలో కే నవీన్ కుమార్ జడ్.పి.హెచ్.ఎస్ రాజోలి, ద్వితీయ స్థానంలో కే జీవీతేష్ జడ్.పి.హెచ్.ఎస్ రామాపురం, మూడవ స్థానము చిన్ని కృష్ణ జడ్పీహెచ్ఎస్ ధరూర్ లు పొందడం జరిగింది. ఈ ఆరుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరిగే గణిత టాలెంట్ లో పాల్గొనబోతున్నారు. గణిత ప్రతిభ పాటవ పరీక్ష ముగింపు కార్యక్రమానికి
జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ టి శ్రీనివాస్ రావు గారు వచ్చి విజేతలకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గణిత ఫోరం జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్ జబరుద్దీన్ గారు, అధ్యక్షులు బసవరాజు గారు, ప్రధాన కార్యదర్శి k అనిత గారు, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేణుకదేవి గారు మరియు మండలాల నుండి వచ్చిన గణిత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
ప్రభుత్వ బాలుర పాఠశాలలో జిల్లా గణిత టాలెంట్ టెస్ట్ ను ప్రారంభించిన అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు.
Related Posts
ప్రజలు దేవుడి తర్వాత డాక్టర్ల ను దేవుడి సమానంగ భావిస్తారు.
ప్రజలు దేవుడు తర్వాత నమ్మేది ఒక డాక్టర్లు దేవుడిగా భావించి … ప్రతి ఒక్క విద్యార్థి సేవాభావంతో ప్రజలకు మెరుగైన సేవలను అందించాలి. మెడికల్ ఎంబిబిఎస్ 2025-2026 వైట్ కోర్ట్ పంపిణీ కార్యక్రమానికి పాల్గొన్న ఎమ్మెల్యే గారు ఈరోజు గద్వాల జిల్లా…
గద్వాల :రైతులకు యూరియా నిల్వలు సరిపడ ఉన్నవని గద్వాల మండల వ్యవసాయాదికారి ప్రతాప్ కుమార్ తెలిపారు.
గద్వాల :రైతులకు యూరియా నిల్వలు సరిపడ ఉన్నవని గద్వాల మండల వ్యవసాయాదికారి ప్రతాప్ కుమార్ తెలిపారు.గద్వాల మండలములో యూరియా నిల్వలు రైతులకు యాసంగి పంటకాలమునకు సరిపడ ఉన్నవన్నారు.రైతు పోదరులకు విన్నపము ఏమనగా, గద్వాల PACS సొసైటీ, ఎ. ఆర్. ఎస్.K-1, ఎ.ఆర్.ఎస్.కె.…

