ప్రజలు దేవుడు తర్వాత నమ్మేది ఒక డాక్టర్లు దేవుడిగా భావించి

త్వరలోనే నూతన మెడికల్ కళాశాల భవనానికి శంకుస్థాపన

ప్రతి ఒక్క విద్యార్థి సేవాభావంతో ప్రజలకు మెరుగైన సేవలను అందించాలి.

మెడికల్ ఎంబిబిఎస్ 2025-2026 వైట్ కోర్ట్ పంపిణీ కార్యక్రమానికి పాల్గొన్న ఎమ్మెల్యే గారు

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నందు నూతన ఎంబిబిఎస్ 2025-2026 విద్యార్థిని విద్యార్థులకు వైట్ కోట్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు హాజరయ్యారు.

కళాశాల ప్రిన్సిపల్ గారు ఎమ్మెల్యే గారికి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు .

ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా విద్యార్థినీ విద్యార్థులకు వైట్ కోట్ ను పంపిణీ చేయడం జరిగినది .

మెడికల్ కాలేజ్ నందు నూతన లైబ్రరీ, కంప్యూటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు

కళాశాల ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ ….

గద్వాల ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి కృషితోనే నేడు మెడికల్ కాలేజీ రావడం జరిగిందని తెలిపారు.

మెడికల్ కాలేజీ ఏర్పాటులో విద్యార్థులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు లెక్చరర్స్ అన్ని విషయంలో ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా రాజీ పడలేదు ఈ ప్రాంతంలోని మెడికల్ కాలేజీ విద్యార్థులకు నాణ్యతమైన విద్యను అందిస్తే వారు భవిష్యత్తులో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా ఉంటారని ఉద్దేశంతో ఒక నిర్ణీతమైన లక్ష్యంతో గద్వాల ప్రాంతం అభివృద్ధి వైపుగా అడుగులు వేసే దిశగా అహర్నిశలు ఎమ్మెల్యే గారు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

మెడికల్ కాలేజీలు ఏ చిన్న పొరపాటు జరిగిన అది ఎమ్మెల్యే గారికి గద్వాల ప్రాంతానికి చెడ్డ పేరు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో నడుచుకోవాలి ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లెక్చర్లు కు సహకరిస్తూ వైద్య వృత్తిని పొందాలి భవిష్యత్తులో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఉత్తమ వైద్యురాలు అవార్డు పొందాలి అదేవిధంగా మీ తల్లిదండ్రులకు గద్వాల ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు.

ఆల్ ది బెస్ట్

ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ …..

గద్వాల ప్రాంతం నడిగడ్డ ప్రాంతం ఇటు కర్నూలు అటు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా లో నడిగడ్డ గద్వాల ప్రాంతం ఉన్నది ఏ చిన్న సమస్య వచ్చినా కర్నూల్ కు రాయిచూర్ కు వెళ్లవలసిన పరిస్థితి ఉండేది. కానీ వల ప్రాంతంలో మెడికల్ కాలేజీ రావడం వల్ల భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాదు గద్వాలలోనే ప్రజలకు మెరుగైన వైద్యము అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

⚡ప్రస్తుతం మెడికల్ కాలేజీ ను భవనంలో కొనసాగించడం జరుగుతుంది త్వరలోనే నూతన మెడికల్ కాలేజ్ భవనం శంకుస్థాపన జరుగును. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలతో హాస్టల్ సౌకర్యంతో మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు.

⚡మీరు మెడికల్ వృత్తిని ఎంచుకొని ప్రజలకు సేవ చేయించాలని నిర్ణయించుకున్నారు మీకు సహకరించిన మీ తల్లిదండ్రులకు అదే విధంగా మీరు కూడా మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అదేవిధంగా గద్వాల ప్రాంతానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

⚡మెడికల్ కాలేజ్ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.

ప్రతి విద్యార్థులు ఆల్ ది బెస్ట్*

👉ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, మాజీ సర్పంచ్, మహబూబ్, నాయకులు శ్రీరాములు, వీరేష్ హాస్పిటల్స్ సూపర్డెంట్, మెడికల్ కాలేజ్ లెక్చరర్స్ అండ్ డాక్టర్స్ , తదితరులు పాల్గొన్నారు.