గద్వాల, డిసెంబర్ 01: సరిహద్దు భద్రతా దళం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు భద్రతా దళాలకు శుభాభినందనలు తెలియజేశారు. ధైర్యం, అంకిత భావం, నిబద్ధతతో దేశానికి రక్షణ కవచంలా ఆరు దశాబ్దాలుగా అసాధారణ సేవలు అందిస్తున్న వీర జవానులకు హృదయపూర్వక వందనాలు.. అని ఒక సందేశంలో పేర్కొన్నారు.


